Thursday, 5 November 2020

క‌ర్వా చౌత్: రానా కౌగిలిలో మిహీక.. ల‌వ్ యూ నిక్ అంటూ ఆకర్షించిన ప్రియాంక చోప్రా

క‌ర్వా చౌత్ అంటే దక్షిణ భారత దేశంలో అంతగా తెలియకపోయినా ఉత్తర భారత దేశంలో మాత్రం ఈ ఫెస్టివల్ అందరికీ సుపరిచితమే. ఈ పండుగ వేళ స్త్రీలు తమ భర్తల శ్రేయస్సు కోరుకుంటూ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి భర్త ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే సౌత్ ఇండియన్ స్టార్ అయినప్పటికీ ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు . తన భార్య మిహీకతో కలిసి మొదటిసారి క‌ర్వా చౌత్ ఫెస్టివల్‌లో భాగమయ్యారు. బుధవారం రోజు తన అత్తారింట్లో క‌ర్వా చౌత్ పండుగ చేసుకున్న రానా.. భార్య మిహీకతో కలిసి ఫోటోలు దిగారు. తాజాగా ఈ పిక్స్ షేర్ షేర్ చేస్తూ మిహీక తల్లి బంటీ బజాజ్ ఇన్స్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. ఈ ఫొటోల్లో ఎరుపు రంగు చీర కట్టుకొని మ్యాచింగ్ బ్లౌజ్‌తో భర్త రానా కౌగిలిలో ఒదిగిపోయి కనిపిస్తోంది మిహీక. ఇలా ఈ నవదంపతులను చూసి మురిసిపోతున్న దగ్గుబాటి ఫ్యాన్స్ వారికి క‌ర్వా చౌత్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు ఈ క‌ర్వా చౌత్ వేడుక‌ను గ్లోబల్ స్టార్ ప్రియాంక‌ చోప్రా- నిక్ జోనాస్ దంప‌తులు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ప్ర‌స్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉన్న ఈ జోడీ క‌ర్వా చౌత్ ప‌ర్వ‌దినాన సాంప్రదాయబద్దంగా పండగ చేసుకున్నారు. ఈ మేరకు చేతిలో‌ హార‌తి పళ్లెం ప‌ట్టుకొని ఎర్రటి సారీతో ట్రెడిషినల్ లుక్‌లో ఆకట్టుకుంది ప్రియాంక. ఈ ఫోటోని త‌న ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేస్తూ.. ''అంద‌రికీ క‌ర్వా చౌత్ శుభాకాంక్ష‌లు. ల‌వ్ యూ నిక్'' అనే కామెంట్ చేసింది ఈ బ్యూటీ. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2I6zIMF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...