Thursday, 5 November 2020

నార‌ప్ప: రంగంలోకి దిగిన విక్టరీ వెంక‌టేష్.. టీజర్ రిలీజ్ ఎప్పుడంటే!

కరోనా విజృంభణ, లాక్‌డౌన్ నేపథ్యంలో గత ఎనిమిది నెలలుగా ఇంటికే పరిమితమైన నటీనటులంతా ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వస్తున్నారు. షూటింగ్ రీ ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్స్ రావడంతో స్టార్ హీరోలు కూడా తమ తమ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా విక్టరీ తన తాజా సినిమా `నార‌ప్ప` షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ భారీ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ వెంకటేష్, హీరోహీరోయిన్లుగా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు ప్రియమణి. లాక్ డౌన్‌కి ముందే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసిన యూనిట్.. మిగిలిన భాగాన్ని ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫినిష్ చేస్తోంది. ఇకపోతే డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ని విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. Also Read: ఈ సందర్భంగా నిర్మాత‌లు సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను మాట్లాడుతూ.. ''అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో 'నారప్ప'‌ షూటింగ్ ప్రారంభించి తమిళ నాడులోని అందమైన లొకేషన్స్‌లో కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశాం. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా నిలిపివేసిన షూటింగ్‌ని త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో తిరిగి ప్రారంభించాం. ప్రియమణి, రావు రమేష్, రాజీవ్ కనకాల త‌దిత‌ర‌ ప్రధాన తారాగణమంతా పాల్గొనగా కీలకమైన సన్నివేశాలు మరియు క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో 80 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. మిగిలిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను పూర్తిచేసి త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌స్తాం" అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mVDSFO
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...