ఓ నెల ముందుగానే మెగా ఇంట పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. మెగా బ్రదర్ కూతురు, హీరోయిన్ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యింది మెగా ఫ్యామిలీ. ముఖ్యంగా వరుణ్ తేజ్ తన చెల్లెలు నిహారిక పెళ్లికి సంబంధించిన పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. మరోవైపు కాబోయే పెళ్లికూతురు నిహారిక సైతం తన పెళ్లి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోందని సమాచారం. తాజాగా పెళ్లి పనులు చూసేందుకు గాను ఆమె ఉదయ్‌పూర్ వెళ్లిందని మెగా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఉదయ్‌పూర్‌లో నిహారిక దిగిన ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కొడుకు జొన్నలగడ్డ వెంకట చైతన్యను పెళ్లాడనుంది మెగా డాటర్ నిహారిక. ఆగస్టు నెలలో వీరిద్దరి నిశ్చితార్ధ వేడుక నిర్వహించారు. అప్పటినుంచి ఆమె పెళ్లికి సంబంధించిన విషయాలు, స్నేహితులతో నిహారిక చేస్తున్న బ్యాచిలర్ పార్టీలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇంతలో మెగా ఫ్యామిలీ.. నిహారిక- చైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ వివరాలు ప్రకటించడంతో అప్పటినుంచి మెగా అభిమానుల చూపు ఈ బ్యూటిఫుల్ జోడీపై పడింది. సోషల్ మీడియాలో నిహారిక- చైతన్య ఫోటోల హంగామా మొదలైంది. Also Read: మరోవైపు కాబోయే భర్తతో నిహారిక సరదాగా షికార్లు కొడుతోంది. ఇప్పటికే స్నేహితులను వెంటబెట్టుకొని కాబోయేవాడితో పాటు గోవాలో చిల్ అయి వచ్చిన మెగా డాటర్.. రెండు రోజుల క్రిందట ఇంట్లోనే చైతన్య, వరుణ్ తేజ్‌లతో కలిసి దీపావళి పండగ సెలబ్రేట్ చేసుకుంది. డిసెంబర్ 9వ తేదీ రాత్రి 7గంటల 15 నిమిషాలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిహారిక- చైతన్య డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ప్రస్తుతం ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IJMfpt
v
No comments:
Post a Comment