Tuesday, 17 November 2020

Varsha: తప్పు నాదే.. అనసూయకు క్షమాపణలు చెప్పా.. జబర్దస్త్ కమెడియన్ వర్ష రివర్స్ గేర్

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ వేదికపై తన నాజూకు నడుముతో కవ్విస్తోంది . దీంతో ఇన్నిరోజులు పాటు ఎవ్వరికీ తెలియని ఈ అందం ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయింది. నిజానికి జబర్దస్త్ తెరపై అడుగుపెట్టకముందే అభిషేకం, ప్రేమ ఎంత మధురం, తూర్పు పడమర లాంటి టీవీ సీరియల్స్‌లో నటించింది ఈ బ్యూటీ. కానీ బ్రేక్ ఇచ్చింది మాత్రమే జబర్దస్త్ కామెడీ షోనే. దీంతో ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తూ ట్రెండ్ అవుతున్న వర్ష.. సడెన్‌గా ఓ పాత వీడియోతో ఇరుక్కుపోయింది. ఇందులో అనసూయపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోవడంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. దీంతో తాజాగా ఈ వీడియోపై వివరణ ఇచ్చుకుంది వర్ష. చాలా రోజుల క్రిందట ఓ బాలుడు వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకుంటుంటే.. ఆమె ఆ సెల్ ఫోన్ తీసి క్రిందకొట్టిన సంగతి తెలిసిందే కదా!. ఇదే ఇష్యూపై అప్పట్లో ఓ వీడియో ద్వారా అనసూయకు క్లాస్ పీకింది వర్ష. నువ్వూ ఓ తల్లివే అంటూ రెచ్చిపోయింది. ప్రస్తుతం వర్షకు బాగా పాపులారిటీ రావడంతో ఈ వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రధాన వార్తాసాధనాల్లో దీనిపై వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన వర్ష.. లైవ్ లోకి వచ్చి అసలు మ్యాటర్ చెప్పేసింది. Also Read: ''అప్పుడు అనసూయ గురించి పూర్తిగా తెలియక అలా మాట్లాడాను. ఆ తర్వాత 'రంగస్థలం' షో చేస్తున్నప్పుడు అనసూయను కలిసి దానికి క్షమాపణలు కూడా చెప్పాను. అనసూయ చాలా కూల్‌గా రిసీవ్ చేసుకుంది. నా గురించి తెలియకే అలా మాట్లాడావ్ కదా అని లైట్ తీసుకుంది. అప్పుడు అనసూయను అలా అనడంలో నాదే తప్పు. ఆ విషయంలో ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను. ఆమె చాలా మంచింది. నాతో సహా చాలా మందికి సాయం చేసింది'' అని చెప్పింది వర్ష. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nuUhkN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...