Tuesday, 3 November 2020

చిక్కుల్లోపడిన రానా, తమన్నా, కోహ్లీ.. సెలబ్రిటీలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు

నేటి రోజుల్లో పలువురు సెలబ్రిటీలు తమ తమ రెగ్యులర్ యాక్టివిటీస్‌తో పాటు పలు యాడ్ షూట్స్ చేస్తూ ఆదాయం పొందుతున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ వ్యవస్థలు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి సెలబ్రిటీల చేత తమ బ్రాండ్స్ ప్రమోట్ చేయించుకుంటున్నాయి. భారీ రేంజ్‌లో యాడ్ షూట్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా అవే యాడ్ షూట్స్ కొంతమంది సినీ, క్రీడా స్టార్లకు లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టాయి. వారు చేసిన యాడ్ షూట్స్‌ కారణంగా హైకోర్టు నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు అనుకూలమైన యాడ్స్‌లో నటించినందుకు గాను క్రీడాకారులు విరాట్‌ , సౌరవ్ గంగూలీలతో పాటు సినీ స్టార్స్ దగ్గుబాటి, సుదీప్, , ప్రకాష్ రాజ్, సుదీప్‌లకు మద్రాస్‌ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అభిమానుల మీద ప్రభావం చూపిస్తాయని తెలిసినా ఇలాంటి వాటికి ఎందుకు ప్రచారకర్తలుగా ఉన్నారని ప్రశ్నిస్తూ వారి నుంచి వివరణ కోరింది. ఈ మేరకు దీనిపై సమాధానం చెప్పేందుకు పది రోజుల గడువు ఇచ్చింది. ఈ నెల 19వ తేదీ లోగా స్పందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది మద్రాస్ కోర్టు. Also Read: ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌లో నష్టపోయి చాలామంది ఆత్మహత్య చేసుకున్నారని, దానిపై తక్షణం నిషేధం విధించాలని మద్రాస్‌ హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పలువురు సెలబ్రిటీలకు నోటీసులు పంపడం జరిగింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GoTimz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...