Tuesday, 3 November 2020

క్రేజీ అప్‌డేట్: పొలిటికల్ లీడర్‌గా రంగంలోకి NTR! పక్కాగా స్కెచ్చేసిన బాలకృష్ణ

మాస్ డైరెక్టర్ , నందమూరి కలిసి మరో నందమూరి హీరో కోసం పక్కాగా స్కెచ్చేశారని తెలుస్తోంది. తమ అప్‌కమింగ్ సినిమా BB 3లో నందమూరి వారసుడు, హీరో తారక రత్నను పొలిటికల్ లీడర్‌గా రంగంలోకి దించి ఆయన కెరీర్ గాడిలో పెట్టాలని చూస్తున్నారట. చిత్రంలో ఎంతో ప్రాధాన్యతతో కూడిన ఈ రోల్ తోనే చేయించాలని బాలయ్య రిక్వెస్ట్ చేయడంతో బోయపాటి ఓకే చెప్పారట. ఈ పాత్ర సినిమాకే హైలెట్ అవుతుందనే టాక్ నడుస్తోంది. మొదటినుంచే తారక రత్న అంటే బాలయ్యకు ఇష్టమనే టాక్ ఉంది. అందుకే అప్పట్లో 'ఒకటో నెంబర్ కుర్రాడు' సినిమాతో బాలయ్యనే ఆయన్ను సినీ రంగంలోకి తీసుకొచ్చారనేది ఫిలిం నగర్ మాట. అయితే నందమూరి హీరోలంతా స్టార్ స్టేటస్ పట్టేసినా ఒక్క తారక రత్న మాత్రమే ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో బాలయ్య మరోసారి బాధ్యత తీసుకున్నారని తెలుస్తోంది. ఏకంగా తన సినిమాలోనే ఓ పవర్‌ఫుల్ రోల్ చేయించి తారక రత్నను తిరిగి లైమ్ లైట్ లోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారట బాలయ్య. Also Read: ఈ మేరకు బోయపాటి దగ్గర పట్టుబట్టి మరీ ఆ పాత్ర కోసం తారక రత్నను తీసుకునేట్లు చేశారని తెలుస్తోంది. BB 3లో ఉన్న పొలిటికల్ క్యారెక్టర్ తారక రత్న కెరీర్‌కి ఖచ్చితంగా ప్లస్ అవుతుందని బాలయ్య భావిస్తున్నారట. ఇక బాలయ్య బాబు అంచనాలు ఏ మాత్రం వమ్ము కాకూడని ఆ బలమైన క్యారెక్టర్‌కు మరిన్ని మెరుగులు దిద్దుతున్నారట బోయపాటి. మరోవైపు ఈ వార్త తెలిసి ఇద్దరు నందమూరి హీరోలను ఓకే తెరపై చూసే అరుదైన అవకాశం ఇది అంటూ ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు. ఇప్పటికే విడుదలైన BB 3 ఫస్ట్ రోర్‌ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. మరోవైపు ఈ సినిమాకు ‘టార్చ్‌బేరర్’ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా బాలయ్య- బోయపాటి కాంబోలో రాబోతున్న ఈ హాట్రిక్ మూవీపై ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mIKhUE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...