Tuesday, 17 November 2020

సానియా మీర్జా డెబ్యూ.. వెబ్‌ సిరీస్‌లో టెన్నిస్ స్టార్

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి బుల్లితెరపై కనిపించనుంది. ఆటతో పాటు అందం కలబోసిన సానియా ఎప్పటి నుంచో సినిమాల్లో నటింపజేయాలని చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే ఇటీవల సానియాకు నటనపై ఆసక్తి పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. Also Read: ‘నిషేధ్ ఎలోన్ టుగెద‌ర్’ వెబ్ సిరీస్‌లో సానియా న‌టించ‌నున్నారట. మొత్తం ఐదు ఎపిసోడ్స్‌గా సాగే ఈ సిరీస్ ఈ నెలాఖరు నుండి ఎంటీవీలో ప్రసారం కానుంది. టీబీపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. Also Read: ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ.. భారత్‌లో టీబీ కారణంగా ఎందరో ఇబ్బంది పడుతున్నారని, ఇందులో సగం మంది 30 ఏళ్లలోపు వారే ఉన్నారని వెల్లడించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో టీబీ తీవ్ర ప్రభావం చూపుతూ మనుషుల ప్రాణాలు తీస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో చైతన్యం కలిగించే సబ్జెక్ట్ కావడంతోనే ఈ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఒప్పుకున్నానని సానియా తెలిపారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pBTwbG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...