Tuesday, 17 November 2020

అలా నటించడం చాలా కష్టం.. జూనియర్ ఎన్టీఆర్ ఛాలెంజింగ్ రోల్ చేశారు: ‘నిరీక్షణ’ అర్చన

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి అర్చన. ఈమెను ‘నిరీక్షణ’ అర్చన అంటే చాలా మంది గుర్తుపడతారు. వరుసగా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఏకైక నటి ఈమె. ‘నిరీక్షణ’, ‘లేడీస్ టైలర్’, ‘దాసి’, ‘మట్టి మనుషులు’, ‘భారత్ బంద్’ వంటి సినిమాలతో తన మార్క్‌ను చూపించారు అర్చన. హీరోయిన్స్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. అంతకు మించి అద్భుతమైన నటన అని నిరూపించిన నటి అర్చన. అందుకే, కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ ఆఖరికి ఇంగ్లిష్‌లో కూడా ఆమె నటించారు. అయితే, సుమారు 25 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులకు దూరమైన అర్చనను ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమం మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. కమెడియన్ ఆలీ వ్యాఖ్యాతగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో అర్చన పాల్గొన్నారు. సోమవారం ప్రసారమైన ఈ ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు అర్చన. ఈ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ప్రస్తావన రావడం విశేషం. ‘మీరు తెలుగు సినిమాలు చూస్తారా’ అని అర్చనను అలీ అడిగారు. దీనికి.. ‘మంచి సినిమాలు కచ్చితంగా చూస్తాను’ అని ఆమె సమాధానం ఇచ్చారు. ‘ఈ మధ్య కాలంలో మీరు చూసిన మంచి సినిమాలు ఏవి?’ అని ఆలీ అడిగారు. దీనికి అర్చన సమాధానం ఇస్తూ.. ‘మహానటి నాకు చాలా నచ్చంది. జనతా గ్యారేజ్ సినిమా కూడా చాలా నచ్చింది. ఆ రెండు సినిమాలు నాకు వేరే లెవెల్‌లో ఉన్నాయి’ అని అన్నారు. ‘ఇప్పుడున్న హీరోల్లో ఇతను చాలా అద్భుతంగా చేస్తున్నాడు అనిపించిన తెలుగు హీరో ఎవరు?’ అని అడిగిన ఆలీ ప్రశ్నకు అర్చన స్పందిస్తూ.. ‘జనతా గ్యారేజ్ చూస్తున్నప్పుడు నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి నటన చాలా నచ్చింది. అది చాలా కన్వెన్సింగ్ పెర్ఫార్మెన్స్. ఒక యాక్టర్ నచ్చారు అంటే ఎందుకు నచ్చారో కూడా కచ్చితంగా చెప్పాలి. అదే సినిమాలో మోహన్ లాల్ గారు ఉన్నారు. అందరికీ ఒక డ్రీమ్ హీరో ఆయన. చాలా ఇన్‌స్పైరింగ్ క్యారెక్టర్ ఆయన. ఆయన స్పేస్ ఆయనకు ఇచ్చిన ఈయన స్పేస్ ఈయన తీసుకొని నటించడం చాలా కష్టం. ఛాలెంజింగ్ రోల్ అంటే అదే. తెలుగు ఇంత మంచి సినిమాలు వస్తున్నాయంటే నాకు చాలా సంతోషంగా ఉంది’ అని అర్చన చెప్పుకొచ్చారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35FcRRs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...