Friday, 6 November 2020

వామ్మో మరీ ఇంత సన్నమా... కీర్తి సురేష్ లుక్‌పై మహేష్ ఫ్యాన్స్ వర్రీ

‘మహానటి’ సినిమాతో శిఖరమంత క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్‌ జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. దీంతో ఆమె తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు పెరిగాయి. పెద్ద హీరోలు సైతం ఆమెతో నటించేందుకు పోటీపడుతున్నారు. అయితే వచ్చిన అవకాశాలను ఆమె చేజేతులా నాశనం చేసుకుంటోంది. కమర్షియల్ చిత్రాలను తిరస్కరిస్తూ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తున్నా అవి పరాజయం పాలవుతున్నాయి. దీనికి తోడు కీర్తి ఇటీవల మరీ బక్కగా మారిపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. Also Read: కీర్తి నటించిన ‘పెంగ్విన్’ భారీ అంచనాల మధ్య విడుదలైన మిస్ ఫైర్ అయింది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘మిస్ ఇండియా’ సినిమాకి దారుణమైన రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా కాన్సెప్ట్ ను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇందులో లుక్స్, పెర్ఫార్మన్స్ కూడా చాలా మందికి నచ్చలేదు. గతంలో కాస్త బొద్దుగా ముద్దుగా ఉండే కీర్తి సడెన్‌గా జీరో సైజ్‌కి మారిపోయింది. ముఖంలో కళ కూడా కోల్పోయింది. ‘మిస్ ఇండియా’ సినిమా కోసం సన్నబడ్డానని ఆమె చెబుతున్నా.. అందులో సన్నగా కనిపించాల్సిన అవసరమైతే కనిపించలేదు. ఇక అసలు విషయానికొస్తే.. కీర్తి సురేష్ తాజాగా మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’లో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కీర్తికి టైమ్ కలిసిరాకపోవడంతో ఆ ఎఫెక్ట్ ఎక్కడ తమ హీరోపై పడుతుందోనని మహేశ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ సినిమాలో కీర్తిని తప్పించి మరొకరిని తీసుకుంటే బాగుంటుందని సోషల్‌మీడియాలో చర్చించుకుంటున్నారు. లేకపోతే కనీసం తమ హీరో సినిమా కోసమైనా కాస్త బరువు పెరిగి క్యూట్ లుక్‌లోకి వస్తే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. ఈ సలహాలు కీర్తి వరకు వెళ్లినా ఆమె మళ్లీ బరువు పెరుగుతుందని చెప్పలేం. అమ్మాయిలే అసూయపడేంత అందంతో రోజురోజుకీ మరింత గ్లామర్‌గా తయారవుతున్న మహేష్‌బాబు‌ పక్కన కీర్తి సురేష్ ఎలా కనిపిస్తుందో చూడాలి మరి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l3CksX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...