Friday, 6 November 2020

టాటా, బై బై అనేసిన నాగార్జున.. చాలా బాధగా ఉందంటూ మెసేజ్.. ఇక కింగ్ దృష్టి మొత్తం దానిపైనే!

స్టార్ హీరో, టాలీవుడ్ కింగ్ అక్కినేని తన లేటెస్ట్ మూవీ '' షూటింగ్ ఫినిష్ చేశారు. గత కొన్ని రోజులుగా హిమాలయాస్‌లోని అందమైన లొకేషన్స్‌లో చివరి షెడ్యూల్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన.. తన పాత్ర తాలూకు పార్ట్ అంతా పూర్తిచేశారు. ఈ విషయాన్ని స్వయంగా తెలుపుతూ ట్వీట్ చేసిన నాగ్, వైల్డ్‌డాగ్ యూనిట్‌తో దిగిన ఫోటోలు షేర్ చేశారు. ''వైల్డ్‌డాగ్‌ మూవీకి సంబంధించి నా పాత్ర షూటింగ్ ఈరోజుతో పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరాను. నా టాలెంటెడ్‌ టీమ్‌కు, హిమాలయాస్‌కు గుడ్‌బై చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది'' అని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు నాగార్జున. ఈ చిత్రంలో ఆయన డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఎసీపీ విజయ్‌ వర్మగా డిఫరెంట్ రోల్‌లో నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో రూపొందనున్న ఈ సినిమాలో నాగ్ సరసన దియామీర్జా నటిస్తున్నారు. సయామీ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఓ వైపు బిగ్ బాస్ హోస్ట్‌గా చేస్తూనే ఇన్ని రోజులు తన వైల్డ్‌డాగ్ షూటింగ్‌లో పాల్గొన్నారు నాగార్జున. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌లో ఆయన పార్ట్ ఫినిష్ కావడంతో ఇక నాగార్జున దృష్టి మొత్తం బిగ్ బాస్ 4 పైనే పెడతారని, ఇకపై ఎలాంటి డిస్టర్బ్ ఉండకపోవచ్చని భావిస్తున్నారు బుల్లితెర ఆడియన్స్. ఇదిలా ఉంటే నాగ్ మరో మూవీ 'బ్రహ్మాస్త్ర' షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ముంబైలో వేసిన సెట్స్‌పై ఇప్పటికే నాగార్జున చేరిపోయారు. సో. చూడాలి మరి 'బ్రహ్మాస్త్ర' చేస్తూనే పాత పద్దతిలోనే బిగ్ బాస్ 4 కోసం ఆయన వచ్చి వెళ్తారా? లేక పూర్తి సమయాన్ని బిగ్ బాస్‌కే కేటాయిస్తారా? అనేది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2I91gk6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...