Wednesday, 4 November 2020

‘ఆచార్య’ షూటింగ్: రంగంలోకి దిగుతోన్న చిరు.. టార్గెట్ సమ్మర్

మెగాస్టార్ క‌థానాయ‌కుడిగా స‌క్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ కొరటాల శివ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఆచార్య’. ఇది చిరంజీవి 152వ చిత్రం. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో రామ్‌ చ‌ర‌ణ్‌ కొణిదెల ప్రొడ‌క్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొవిడ్ నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆగిన విషయం తెలిసిందే. ఇప్పుడు త‌గు జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పునఃప్రారంభించ‌డానికి చిత్రయూనిట్ సిద్ధమైంది. న‌వంబ‌ర్ 9 నుండి ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన మేజ‌ర్ పార్ట్ పూర్తవుతుంది. కొవిడ్ నేప‌థ్యంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా షూటింగ్‌ను పూర్తి చేయ‌డానికి అవ‌స‌ర‌మైన జాగ్రత్తలను కొరటాల శివ బృందం తీసుకుంది. మెగా భిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అంచనాల‌కు త‌గిన‌ట్లుగానే చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన మోష‌న్ పోస్టర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండ‌గా, సురేశ్ సెల్వరాజ‌న్‌ ప్రొడ‌క్షన్ డిజైన‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/389ezfm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...