బాలీవుడ్ హాట్ బాంబ్ పూనం పాండేపై మళ్లీ వార్తల్లోకెక్కింది. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఆమెపై తాజాగా గోవాలోని కనకోవా పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో మే నెలలో పూనమ్ తన కారులో డ్రైవ్ చేయడంతో ముంబయి పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ప్రియుడిని పెళ్లి చేసుకుని గోవాకు వెళ్లింది. Also Read: రెండ్రోజులు తిరగకముందే భర్త తనను కొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని క్షమించేశానంటూ కేసు వాపసు తీసుకుంది. తాజాగా గోవాలోని చపోలీ డ్యామ్ వద్ద పూనమ్ అసభ్య వీడియోను చిత్రీకరిస్తుండగా పోలీసులు గుర్తించారు. వీడియో తీస్తున్న వ్యక్తితో పాటు పూనమ్‌పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చపోలీ డ్యామ్ పవిత్రతను, సంస్కృతిని దెబ్బతీసేలా ప్రవర్తించినందుకే పూనమ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mIsUUa
v
No comments:
Post a Comment