Friday, 6 November 2020

డైరెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆశిష్ గాంధీ కెరీర్ టర్న్ చేసే మూవీ అంటున్న చిత్రయూనిట్

తొలి సినిమా 'నాటకం'రూపంలో విభిన్న కథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకొచ్చి తనను తాను ప్రూవ్ చేసుకుంటూ హీరోగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వెర్సటైల్ యాక్టర్ తాజా చిత్రంగా 'డైరెక్టర్' మూవీ రూపొందుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో మరో హీరోగా శ్యామ్ నటిస్తుండగా.. మరీనా, ఐశ్వర్య, ఆంత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. Also Read: మాస్టర్ జశ్విన్ రెడ్డి సమర్పణలో విజన్ సినిమాస్, దీపాల ఆర్ట్స్ బ్యానర్స్‌పై కిరణ్ పొన్నాడ- కార్తీక్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ 'డైరెక్టర్' చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా కథ ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉంటుందని, సరికొత్తగా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని అంటున్నారు మేకర్స్. హీరో ఆశిష్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగిందని, ఈ సినిమా ఆశిష్ కెరియర్‌ని మలుపు తిప్పే చిత్రం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు దర్శకనిర్మాతలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n2qOPb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...