Thursday, 22 October 2020

Shivathmika: దయచేసి ఫేక్ న్యూస్‌ స్ప్రెడ్ చేయ‌కండి.. శివాత్మిక రిక్వెస్ట్.. ఇంతకీ రాజశేఖర్ క్షేమమేనా?

ఇటీవలే తాను, తన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డామని పేర్కొంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు కుమార్తెలు , శివాని కోలుకోగా.. తాను, జీవిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు రాజశేఖర్ పేర్కొనడంతో టాలీవుడ్ లోకం ఒకింత ఆందోళన చెందింది. ఈ క్రమంలో తాజాగా ఈ రోజు (అక్టోబర్ 22) తన తండ్రి రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుపుతూ ట్వీట్ చేసింది శివాత్మిక. కానీ ఈ పోస్ట్ రాంగ్ ఇండికేష‌న్స్ ఇవ్వడంతో రాజశేఖర్ సీరియస్‌గా‌ ఉన్నారనే వార్తలు వ్యాప్తి చెందాయి. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు, రాజశేఖర్ అభిమానులు మరింత ఆందోళన చెందారు. ''కరోనాతో పోరాటం చేస్తూ నాన్న కాస్త ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. మెల్లగా మెరుగుపడుతున్నారు. మీ అందరి అభిమానంతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఆశిస్తున్నాను. నాన్న త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేయండి'' అంటూ శివాత్మిక ట్వీట్ చేయడంతో సోషల్ మీడియా అంతా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. చిరంజీవి సహా కొందరు సినీ తారలు సైతం స్పందిస్తూ రాజశేఖర్ తిరిగి కోలుకోవాలని కోరుకున్నారు. Also Read: నిజానికి పాజిటివ్‌గా వెళ్లాలని శివాత్మిక చేసిన ఈ ట్వీట్ నెగెటివ్ ప్రచారానికి ఊతమిస్తూ రాజ‌శేఖ‌ర్ ఆరోగ్య పరిస్థితి విష‌మం అనే ప్ర‌చారం దాకా వెళ్లింది. పలు యూ ట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్ రాజశేఖర్ పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని వార్తలు రాసేశాయి. దీంతో మ‌రోసారి దీనిపై ట్వీట్ చేసిన శివాత్మిక నాన్న కోలుకుంటున్నారు.. దయచేసి ఆయ‌న ఆరోగ్యం విష‌మంగా ఉందంటూ ఫేక్ న్యూస్‌ స్ప్రెడ్ చేయ‌కండి అని పేర్కొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TdSS5a
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...