Saturday, 24 October 2020

Samantha: బిగ్ బాస్ హోస్ట్‌గా సమంత కన్ఫమ్.. నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదంటూ ఎంట్రీ

బుల్లితెర భారీ పాపులారిటీ షో బిగ్ బాస్ హోస్ట్ మారిపోయారు. షో ప్రారంభం నుంచి రక్తి కట్టిస్తున్న నాగార్జున స్థానంలో వేరొకరు రాబోతున్నారు. ఇదేంటి.. ఇది కొత్త విషయం కాదుగా! గత రెండు మూడు రోజుల నుంచి వింటూనే ఉన్నాంగా అనుకుంటున్నారు కదూ. అయితే ఉహాగానాలుగా ఉన్న ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. నాగార్జున స్థానంలో హోస్ట్‌గా రంగంలోకి దిగబోతుందని తెలుపుతూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది బిగ్ బాస్ యాజమాన్యం. ఈ మేరకు ప్రోమో వీడియో రిలీజ్ చేసి బుల్లితెర లోకంలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. బిగ్ బాస్ హోస్ట్‌గా చేస్తున్న నాగార్జున అంతకుముందే కొన్ని సినిమాలకు కమిటై ఉన్నారు. కరోనా కారణంగా ఇన్నాళ్లుగా షూటింగ్స్‌కి దూరంగా ఉన్న ఆయన.. ఆ షూటింగ్స్ రీ ఓపెన్ కావడంతో కాస్త బిజీ అయ్యారు. ఈ మేరకు కొన్ని రోజులుగా అటు బిగ్ బాస్, ఇటు సినిమా షూటింగ్స్ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న నాగార్జున రానున్న రెండు వారాల్లో మాత్రం బిగ్ బాస్ తెరపై కనిపించననే హింట్ ఇస్తూ నిన్ననే ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం తాను మనాలీలో 'వైల్డ్ డాగ్' మూవీ షూటింగ్‌లో ఉన్నానని, కొన్నిరోజుల తర్వాత కలుద్దామని చెప్పారు. దీంతో ఆయన ఈ వారం బిగ్ బాస్ తెరపై కనిపించరని అంతా ఫిక్సయ్యారు. Also Read: తాజాగా అదే నిజమని తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది బిగ్ బాస్ మేనేజ్‌మెంట్. ఈ వారం దసరా స్పెషల్ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున బదులుగా సమంతనే కనిపించనుందని కన్ఫమ్ చేశారు. ఈ వీకెండ్‌లో సమంతనే తెరపైకొచ్చి ఇంటి సభ్యులను పలకరిస్తారని పేర్కొంది. రేపు (అక్టోబర్ 24) సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ 4 దసరా స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుందని, ఇందులో సమంత సందడి చూసి ఎంజాయ్ చేయండంటూ షార్ట్ వీడియో రిలీజ్ చేశారు. దీంతో అక్కినేని అభిమానులతో పాటు బుల్లితెర ఆడియన్స్ అంతా సమంతను చూసే ఆ క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37DMfRW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...