దగ్గుబాటి వారసుడు, స్టార్ హీరో తన సతీమణి మిహీకా బజాజ్‌తో కలిసి దసరా సంబరాలు చేసుకున్నారు. అత్తారింటికి చేరి అక్కడే మిహీక, ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోలో రానా అత్తయ్య బంటీ బజాజ్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన తార రానా జోడీని చూసి మురిసిపోతూ ఆయనకు ప్రత్యేకంగా దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు. లాక్‌డౌన్ సమయంలో బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్‌బాయ్ చెప్పి తన ఇష్టసఖి మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్లేశారు దగ్గుబాటి రానా. పెళ్లైన తర్వాత ఇదే ఆ నవ దంపతుల తొలి దసరా. దీంతో అత్తారింట్లో చేరి తెగ హంగామా చేశారట రానా. అంతా కలిసి దసరా పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారట. హైదరాబాద్‌లోనే ఉన్న మిహీక ఇంట్లో రానా చేసిన సందడి, అత్తా మామలతో దిగిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ట్రెడీషనల్ లుక్‌లో కనిపిస్తూ రానా- మిహీక దంపతులు మెరిసిపోతున్నారు. Also Read: ఇక రానా కెరీర్ విషయానికి వస్తే.. పెళ్లికి ముందే కమిటైన సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు ఈ దగ్గుబాటి వారసుడు. ''అరణ్య, హిరణ్యకశ్యప, విరాట పర్వం'' సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలను లైన్‌లో పెట్టారు ఈ ప్యాన్ ఇండియా స్టార్. రానా డేట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారట. కానీ కేవలం విలక్షణ పాత్రలు, ఆసక్తికర కథల్లో మాత్రమే రానా నటించాలని ఫిక్సయ్యారట. ఆ దిశ గానే ప్రస్తుతం ఆయన అడుగులు పడుతున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HFFQuw
v
No comments:
Post a Comment