Monday, 26 October 2020

విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ ప్రారంభం.. రిబ్బన్ కట్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల 1972లో శ్రీ విజయ కృష్ణ మూవీస్ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. ‘మీనా’, ‘హేమా హేమీలు’, ‘అంతంకాదిది ఆరంభం’ వంటి సూపర్ హిట్ చిత్రాలు ఈ బ్యానర్ నుండి వచ్చాయి. అదే సమయంలో విమర్శకుల ప్రసంశలు పొందిన చిత్రాలు ఎన్నో తీసి విజయ నిర్మల గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. స్టూడియోతో పాటు డబ్బింగ్ స్టూడియో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టూడియో, ఎడిట్ సూట్స్, ఔట్ డోర్ యూనిట్స్‌ను స్థాపించారు. శ్రీ విజయ కృష్జ బ్యానర్ స్థాపించి దాదాపు 50 ఏళ్ళు అవుతుంది. ఈ సంస్థను డాక్టర్ నరేష్, ఆయన కుమారుడు నవీన్ విజయ కృష్ణ కలిసి ‘విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో రీ లాంచ్ చేశారు. ఈ స్టూడియో కార్యాలయాన్ని సూపర్ స్టార్ కృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చైర్మన్ ఛాంబర్, కాన్ఫరెన్స్ హాల్‌ను కృష్ణ అల్లుడు, హీరో సుధీర్ బాబు ప్రారంభించారు. ప్రియ సుధీర్ పాలు పొంగించారు. అడ్మిన్, రిసెప్షన్ బ్లాక్స్‌ను విజయ నిర్మల తమ్ముళ్లు రవికుమార్, రామనాథ్ ప్రారంభించారు. వైస్ ప్రెసిడెంట్ నవీన్ విజయ కృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ వీకే నరేష్, విజయ కృష్ణ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపారు. బంధువులు, స్నేహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34ubPan
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...