Monday, 26 October 2020

Vantalakka అభిమానులకు శుభవార్త.. ఇక వెండితెరపై ఆమె హంగామా! సీక్రెట్ చెప్పిన సీరియల్ నటి

వంటలక్క.. ఏ ఒక్కరికీ పరిచయం అక్కర్లేని పేరిది. ఆమె అసలు పేరు . మలయాళీ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. కేవలం క్యారెక్టర్ వేసి భారీ క్రేజ్ కొట్టేసిన ఆమెకు చిన్న- పెద్ద, పురుషులు- మహిళలు అనే తేడాలేకుండా అమితమైన అభిమాన వర్గముంది. కార్తీక దీపం సీరియల్ ద్వారా అందరి ఇంటి మనిషిగా మారిన ఆమె ఇకపై వెండితెరపై కూడా అలరించనుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే కన్ఫర్మ్ చేయడంతో సిల్వర్ స్క్రీన్‌పై వంటలక్కను చూడాలనే కుతూహలం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. సాధారణంగా ప్రతి రోజు చిన్నితెరపై వంటలక్కను చూడని సగటు గృహిణి ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏది ఏమైనా 'కార్తీక దీపం' చూడాల్సిందే అని పట్టుబట్టుకు కూర్చుంటారు మహిళలు. మొన్నామధ్య వరదలు వచ్చి ఇల్లంతా నీటితో నిండితే కూడా కుటుంబమంతా కలిసి ఆ నీటిలో ఆ సీరియల్ చూస్తున్న పిక్ ఆ సీరియల్ క్రేజ్‌ని అద్దం పట్టింది. ఇకపోతే కార్తీక దీపం రేటింగ్‌ ముందు పెద్ద పెద్ద సినిమాలు సైతం డీలా పడిపోవడం చాలాసార్లు చూసాం. ఇంత పాపులారిటీకి ప్రధాన కారణం వంటలక్క క్యారెక్టర్ అని అంటుంటారు మహిళలు. Also Read: ఈ నేపథ్యంలో తాను వెండితెరపై నటిస్తున్నట్లు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమి విశ్వనాథ్ (వంటలక్క) చెప్పడంతో ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆతృత కనిపిస్తోంది. లేడి ఓరియెంటెడ్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఓ తెలుగు మూవీలో తాను పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది వంటలక్క. కరోనా మహమ్మారి వీర విజృంభణ, లాక్‌డౌన్ రావడం కారణంగా కాస్త ఆలస్యమైందని లేకపోతే ఈ పాటికి ఆ మూవీ షూటింగ్ ఫినిష్ అయ్యేదని తెలిపింది. ఇకపోతే తాను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, అది అనుకోకుండా అలా జరిగిపోయిందని ప్రేమి విశ్వనాథ్ చెప్పింది. సో.. చూడాలి మరి ఇన్నాళ్లుగా బుల్లితెరపై అలరించిన వంటలక్క వెండితెరపై ఎలాంటి హవా చూపిస్తుందనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31KiivY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...