Thursday, 1 October 2020

Kangana Ranaut: మళ్ళీ మొదలెట్టిన కంగనా.. మీ ఆశీర్వాదాలు కావాలంటూ మ్యటర్ చెప్పేసింది

లాక్‌డౌన్ వేళ పలు వివాదాల్లో తలదూర్చి సంచలన కామెంట్స్ చేసిన .. ఇక సినిమా షూటింగులతో బిజీ అవుతోంది. కరోనా కారణంగా గత ఆరు నెలలకు పైగా కెమెరాకు దూరంగా ఉన్న ఈ ఫైర్ బ్రాండ్ తిరిగి ఈ రోజే (అక్టోబర్ 1) సెట్స్ పైకి వచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది కంగనా. ఈ మేరకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలని ఆమె కోరడం విశేషం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న `తలైవి` సినిమాలో కంగన లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా గత కొన్నినెలలుగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ తిరిగి ఈ రోజే ప్రారంభమైంది. దీంతో ఇందులో పాల్గొనడం పట్ల తన ఫీలింగ్స్ తెలుపుతూ పోస్ట్ పెట్టిన కంగనా.. ''ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. దాదాపు ఏడు నెలల తర్వాత సెట్స్ మీదకు వస్తున్నా. ఎంతో ఆసక్తికరమైన `తలైవి` సినిమా కోసం దక్షిణాదికి పయనమవుతున్నా. ఈ విపత్కర పరిస్థితుల్లో మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నా'' అంటూ ట్వీట్ చేసింది. ఈ మేరకు నేటి ఉదయం తీసుకున్న ఫ్రెష్ సెల్ఫీ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. Also Read: ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ '' చిత్రంలో ఇతర రాజకీయ నాయకులకు జయలలిత ఇచ్చిన కౌంటర్స్ యధావిధిగా చూపించనున్నారని టాక్. అదేవిధంగా జయలలిత జీవితంలో ఎత్తుపల్లాలు, వివాదాలు అన్నీ కళ్ళకు కట్టినట్లు ఇందులో చూపించనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. చివరి దశ షూటింగ్ కంప్లీట్ చేస్తున్న చిత్రయూనిట్ అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Sjx0EQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...