యూత్ స్టార్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి ఒక సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. ఈ సినిమాకు ‘చెక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు ‘చెక్’ టైటిల్, ప్రీలుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ గురువారం ఆవిష్కరించారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ.. ‘‘చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడిన ఖైదీ కథ ఇది. ఇందులో నితిన్ అద్భుతంగా చేస్తున్నాడు. ఈసినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది’’ అని చెప్పారు. నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘నితిన్-చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లోసినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఎవరు ఎవరికి ఎలా చెక్ పెడతారనేది చివరి వరకూ తెలియదు. ఇంత వరకు నితిన్ ఈ తరహా పాత్ర చేయలేదు. పెర్ఫార్మెన్స్ పరంగా ఈ చిత్రంలో నితిన్ విశ్వరూపం కనిపిస్తుంది. చంద్రశేఖర్ యేలేటి మేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పంథాలోనే ఉంటూ వాణిజ్య అంశాల మేళవింపుతో ఈ సినిమా ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్‌ల పాత్రలు కూడా విభిన్నంగా ఉంటాయి. రకుల్ ఇంతకు ముందు మా సంస్థలో ‘లౌక్యం’ చేసింది. ప్రియా వారియర్‌కి తెలుగులో ఇదే తొలి చిత్రం. ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకూ షెడ్యూల్ చేస్తాం. దాంతో దాదాపుగా చిత్రీకరణ పూర్తవుతుంది. ఇతర విశేషాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని తెలిపారు. కాగా, ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GrxFBs
v
No comments:
Post a Comment