Thursday, 1 October 2020

బాలకృష్ణ పెద్ద మనసు.. టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఆ కార్యకర్త కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడూరు కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్త నర్సింహప్ప మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ.. నర్సింహప్ప కుటుంబానికి రూ.1 .5 లక్షల ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. బాలకృష్ణ ఆదేశాలతో స్థానిక నాయకులు బాధితుని ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే అందించిన రూ.1 .5 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ బాండును కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను ఫోనులో పరామర్శించిన నందమూరి బాలకృష్ణ వారికి మనోధైర్యాన్ని అందించారు. అలాగే పిల్లలను బాగా చదివించుకోవాలని అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అభయమిచ్చారు. అదే విధంగా స్థానిక టీడీపీ నాయకులు ఆ కుటుంబానికి తమ వంతుగా ఆర్థిక సహాయం అందించారు. తమకు అండగా నిలిచిన నందమూరి బాలకృష్ణకి, స్టానిక టీడీపీ నాయకులకు నర్సింహప్ప కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34cqjdq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...