Thursday, 1 October 2020

Anushka: ఇన్ని పుకార్లా? నమ్మొద్దు బాబోయ్.. అదే నిజమైతే నేనే మీ అందరికీ చెబుతాగా!

సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టుకురావడం, తప్పని పరిస్థితుల్లో వాటిపై సదరు సెలబ్రిటీలు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుండటం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా స్టార్ హీరోహీరోయిన్ల సినిమా, ప్రేమ, పెళ్లి తదితర విషయాలపై పెద్దఎత్తున రూమర్స్ బయటకొస్తుంటాయి. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా స్వీటీ అనుష్కపై కొన్ని రూమర్స్ షికారు చేస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన ఆమె ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తూ దయచేసి అలాంటి రూమర్స్ నమ్మొద్దంటూ ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసింది. హీరోగా రాబోతున్న భారీ సినిమా ''. ఇటీవలే ఈ భారీ బడ్జెట్ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తాడని, అలాగే రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తాడని ప్రకటించిన చిత్రయూనిట్.. సీత క్యారెక్టర్ ఎవరు పోషిస్తారనేది మాత్రం సీక్రెట్‌గా ఉంచింది. దీంతో 'ఆదిపురుష్'లో సీత క్యారెక్టర్‌పై పెద్దఎత్తున రూమర్స్ బయటకొచ్చాయి. సీతగా నటించనుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. Also Read: ప్రభాస్- అనుష్క సక్సెస్‌ఫుల్ జోడీ కావడంతో ఇదే నిజమంటూ ఫిలింనగర్‌లో ఎక్కడచూసినా ఇదే మాట్లాడుకుంటున్నారు. సీతగా అనుష్క కన్ఫర్మ్ కానీ.. సినిమాపై హైప్ తీసుకొచ్చేనందుకు రహస్యంగా ఉంచుతున్నారని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై స్వయంగా రియాక్ట్ అయింది అనుష్క. తాను 'ఆదిపురుష్' సినిమాలో నటించడం లేదని, ఆ రూమర్స్ నమ్మొద్దని క్లారిటీ ఇచ్చేసింది. ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో తాను నటించబోతున్నాననే రూమర్స్ ఎలా మొదలయ్యాయో అర్థం కావడం లేదని అనుష్క పేర్కొంది. ఇప్పటివరకైతే 'ఆదిపురుష్' చిత్రయూనిట్ తనను సంప్రదించలేదని ఆమె చెప్పింది. ఒకవేళ అంత గొప్ప పాత్రలో నటించే అవకాశం తనకు వస్తే తానే అధికారికంగా వెల్లడిస్తాను కానీ ఇలాంటి పుకార్లను నమ్మొద్దని తెలిపింది అనుష్క. ఆమె చేసిన లేటెస్ట్ మూవీ 'నిశ్శబ్దం' అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HNSUyf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...