‘ఖలేజా’ సినిమా 10 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఇటీవల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సూపర్ స్టార్ మరోసారి జత కడుతున్నట్టు ఖరారైంది. ఈ మేరకు త్రివిక్రమ్‌కు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరోవైపు, ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాను మహేష్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. అయితే, ఈ రెండు సినిమాల షూటింగ్‌లు వచ్చే ఏడాది ప్రారంభంకానున్నట్టు సమాచారం. పరశురామ్, త్రివిక్రమ్ దర్శకత్వాల్లో రెండు సినిమాలను ఒకేసారి మహేష్ బాబు చేయనున్నారని తెలుస్తోంది. 2021లో ఈ రెండు సినిమాల షూటింగ్‌లను ఒకేసారి పూర్తిచేయనున్నారట. ‘గీతగోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పరశురామ్ ఆ వెంటనే మహేష్ బాబును ఒప్పించారు. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాతో నాన్-బాహుబలి రికార్డులను తిరగరాసిన త్రివిక్రమ్.. ఒక మంచి కథను మహేష్‌కు వినిపించారట. ఈ కథ మహేష్‌కు బాగా నచ్చేయడంతో ఆయన వెంటనే అంగీకరించారని సమాచారం. కరోనా వైరస్ కారణంగా ఇంచుమించుగా ఏడాది కాలం వృథాగా పపోయింది. అందుకే, వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లో రెండు సినిమాలు పూర్తిచేయాలని మహేష్ నిర్ణయించుకున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఒకే ఏడాది మహేష్ బాబు నుంచి రెండు సినిమాలు వస్తే అభిమానులకు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31pv175
v
No comments:
Post a Comment