యంగ్ టైగర్ ఏడాదికొక సినిమాతో అభిమానుల ముందుకు వచ్చేవారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా అభిమానులకు మాత్రం మంచి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలుగజేసేవారు. కానీ, ఇప్పుడు రెండేళ్ల సుధీర్ఘ విరామం వచ్చేసింది. 2018 అక్టోబర్ 11న విడుదలైన ‘అరవింద సమేత వీర రాఘవ’ తరవాత మరో సినిమాతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కారణం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీని అంగీకరించడమే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎంతో కష్టపడుతున్నారు. అయితే, RRR సినమా నుంచి ఈ లాక్‌డౌన్ సమయంలో విడుదలైన అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ మెగా అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చింది. కానీ, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు వాళ్లకూ టైమ్ వచ్చింది. ఈనెల 22న భీమ్ అభిమానుల ముందుకు వస్తున్నాడు. అది కూడా ఉప్పెనలా. ఈ ఉప్పెనకు ముహూర్తం ఖరారు చేసింది RRR టీం. ఈనెల 22న ఉదయం 11 గంటలకు భీమ్‌ను రామరాజు పరిచయం చేయబోతున్నాడు. Also Read: కాగా, నందమూరి అభిమానులకు రెండేళ్ల విరామానికి తగ్గ ఫలితం దక్కబోతోందని చిత్ర యూనిట్ నుంచి వస్తోన్న సమాచారం. సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ మాదిరిగానే భీమ్‌గా కండలు తిరిగిన శరీరంతో ఎన్టీఆర్ కనిపించబోతున్నారట. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఆయన శరీరాకృతి ఉండబోతోందని సమాచారం. టీజర్ ఇప్పటికే రెడీ అయ్యిందనీ.. ఔట్‌పుట్ విషయంలో రాజమౌళి పూర్తి సంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఎన్టీఆర్ లుక్, రామ్ చరణ్ వాయిస్ ఓవర్, కీరవాణి సంగీతం భీమ్ టీజర్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయని అంటున్నారు. ఇంకా రెండు రోజులు మాత్రమే.. అభిమానులూ గెట్ రెడీ!
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kfMiHj
v
No comments:
Post a Comment