Tuesday, 20 October 2020

800 ఎఫెక్ట్: విజయ్ సేతుపతి కూతురిని రేప్ చేస్తానంటూ బెదిరింపులు

శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి తప్పుకున్నప్పటికీ విజయ్ సేతుపతికి కష్టాలు తప్పడం లేదు. తన బయోపిక్ విషయంలో వివాదాలు తలెత్తడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలంటూ విజయ్‌ సేతుపతికి మురళీధరన్ విజ్ఞప్తి చేశారు. మంచి నటుడని, కేవలం తన సినిమా వల్ల అతడికి ఏ ఇబ్బంది కలగకూడదని భావించి ఆయనను తప్పుకోవాలని కోరుతున్నట్లు ఓ లేఖ విడుదల చేశారు. దీనిపై స్పందించిన విజయ్ సేతుపతి ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ‘ ధన్యవాదాలు.. ఇక సెలవు’ అని ట్వీట్ చేశారు. Also Read: అయితే ఈ ప్రాజెక్టుకు నుంచి విజయ్ తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ ఆయన కుటుంబాన్ని కొందరు వేధింపులకు గురిచేస్తున్నారు. విజయ్ సేతుపతి చిన్న కుమార్తెను రేప్ చేస్తామని, అప్పుడే అతడికి ఈలం తమిళుల బాధ అర్థమవుతుందంటూ కొందరు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ విషయాన్ని విజయ్ సేతుపతి సోషల్‌మీడియా ద్వారా వెల్లడించడంతో నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ట్రోల్స్‌పై సింగర్ చిన్మయి కూడా తీవ్రంగా స్పందించారు. ఆ నెటిజన్ ట్రోల్స్‌ను స్ర్కీన్‌షాట్ తీసి తన అకౌంట్లో షేర్ చేశారు. ‘ఇలాంటి నీచమైన వ్యక్తులే సమాజంలో లైంగిక నేరాలకు మద్దతు పలుకుతారు, దీనిని ఎవరూ మార్చలేరు?. అమ్మాయిలను బహిరంగంగా అత్యాచారం చేస్తానని చెబుతున్న వ్యక్తి నేరస్థుడు. ఇంత జరుగుతున్న చూస్తూ ఊరుకుంటున్నారంటే సిగ్గుచేటు’ అంటూ ట్వీట్ చేస్తూ అడయార్‌ డిప్యూటీ కమిషనర్‌, చెన్నై పోలీసులను ట్యాగ్‌ చేశారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m52NGI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...