Tuesday, 20 October 2020

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: ‘ఊపిరి’ నటి సోదరుడి అరెస్ట్

డ్రగ్స్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. యంగ్ హీరో సుశాంత్‌ సింగ్ ఆత్మహత్య కేసులో దర్యాప్తు ద్వారా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రియా జైలు నుంచి బయటపడింది. తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు మరో నటి సోదరుడిని అరెస్ట్ చేశారు. నాగార్జున ‘ఊపిరి’ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన నటి గాబ్రియెల్లా డెమెట్రైడీస్‌ సోదరుడు అగిసియాలోస్‌ని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లొనోవాలా రిసార్ట్స్‌లో ఉండగా అతడిని అరెస్ట్ చేసిన అధికారులు అల్పాజోలమ్ టాబ్లెట్లు, హషీష్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అగిసియాలోస్‌కి అనేక మంది డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు. ఇదే కేసులో బాలీవుడ్ నటుడు, గాబ్రియెల్లా పార్టనర్ అర్జున్ రాంపాల్ పేరు కూడా వినిపిస్తోంది. దర్యాప్తు ముందుకెళ్లేకొద్దీ మరెంత మంది పేర్లు బయటికి వస్తాయో చూడాలి మరి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kd8Fx6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...