విలక్షణమైన కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్ చేస్తుంటారు తమిళ నటుడు సూర్య. అందుకే ఆయనకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. త్వరలోనే ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన మరో సినిమాకు ఓకే చెప్పారు. తమిళుల సాహస క్రీడ జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కనున్న ‘వాడివాసల్’ చిత్రంలో సూర్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. Also Read: ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో గ్రామీణ జల్లికట్టు క్రీడాకారుడి పాత్రలో సూర్య కనిపించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ఆయన తన గెటప్ మార్చుకున్నారు. గడ్డం, పొడవైన మీసాలతో పాటు జుట్టు దట్టంగా పెంచుకుని గ్రామీణ జల్లికట్టు కీడ్రాకారుడిని తలపిస్తున్నారు. సూర్య గెటప్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T6p62l
v
No comments:
Post a Comment