జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ బారిన పడ్డారని గత వారం రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై సుధీర్ టీమ్ స్పందించకపోడంతో సుధీర్‌ని కరోనా కాటేసిందని ఫిక్సయ్యారంతా. ఇదిలా ఉండగానే తాజాగా సుధీర్ జోడీ, ఆయన రొమాంటిక్ పార్ట్‌నర్ రష్మీ గౌతమ్ కూడా కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. రష్మీకి ఇటీవల స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించగా కరోనా టెస్ట్ చేయించుకుందని, ఆ రిపోర్ట్‌లో పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతం ఆమె షూటింగ్స్ అన్నింటికీ దూరంగా ఉంటోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు సంబంధించి అక్టోబర్ 23వ తేదీన అలాగే అక్టోబర్ 28 తేదీన జరిగే షూటింగ్స్‌ను క్యాన్సిల్ చేసినట్టు యూనిట్ వర్గాలు పేర్కొనడంతో జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. అయితే తనకు కరోనా సోకినట్లు రష్మీ గౌతమ్ అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. Also Read: మరోవైపు రష్మీ, నందు ప్రధాన పాత్రల్లో ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ మూవీ టీజర్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి. అయితే కరోనా కారణంగా ఈ మూవీ ప్రమోషన్స్‌ని కూడా పక్కనబెట్టి హోమ్ క్వారంటైన్‌లోనే ఉందనేది లేటెస్ట్ సమాచారం. చూడాలి మరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ ఈ వార్తలపై ఎలా రియాక్ట్ అవుతుందనేది!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ti2Nqg
v
No comments:
Post a Comment