Wednesday, 28 October 2020

పునర్నవి పెళ్లి ఫిక్స్: ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించిన బిగ్ బాస్ బ్యూటీ!

‘ఉయ్యాల జంపాల’ నటి భూపాలం బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో పునర్నవి రిలేషన్‌షిప్ అప్పట్లో హాట్ టాపిక్. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య ఏదో ఉందనే భావనను ప్రేక్షకులకు కలిగించారు. షో నుంచి బయటికి వచ్చిన తరవాత కూడా ఇదే విషయం మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చిన తరవాత కొంత కాలం ఖాళీగా ఉన్న పునర్నవి ఆ తరవాత బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని సినిమాలు, వెబ్ షోలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, పునర్నవి ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక ఫొటో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తనకు పెళ్లి కుదిరినట్టు, నిశ్చితార్థం అయిపోయినట్టు తెలియజేస్తూ ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను ఈ ఫొటోలో చూపించారు పున్ను. ‘‘మొత్తానికి జరిగిపోయింది’’ అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతానికి అయితే ఇన్‌స్టా్గ్రామ్‌లో పున్ను ఫాలోవర్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కానీ, ఎక్కడో చిన్న అనుమానం తడుతోంది. నిజంగా ఆమెకు నిశ్చితార్థం అయిపోయిందా? లేదంటే పవన్ సాదినేని దర్శకత్వంలో చేస్తున్న తన కొత్త వెబ్ షో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఫొటో షేర్ చేశారా? అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే, ఇటీవల సాయి ధరమ్ తేజ్ కూడా అలానే చేశారు. తనకు పెళ్లి ఫిక్స్ అయినట్టు అందరినీ నమ్మించి అది ‘సోలో బ్రతుకే సో బెటర్’ ప్రమోషన్ అని సింపుల్‌గా చెప్పేశారు. మరి, పున్ను పెళ్లి కుదిరిన విషయం నిజమా, కాదా అనే విషయాన్ని కాలమే చెప్పాలి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e4FhXn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...