సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. కొన్ని నెలల ముందు ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా సుమారు ఏడు నెలలు పాటు తాత్కాలికంగా ఆగిపోయింది. లాక్‌డౌన్ నుంచి షడలింపులు ఇస్తూ వచ్చిన ప్రభుత్వం షూటింగ్‌కు కూడా అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చాలా మంది స్టార్లు షూటింగ్‌లు ప్రారంభించినప్పటికీ చిరంజీవి మాత్రం తన సినిమా షూటింగ్‌ను ప్రారంభించడానికి ఆసక్తి చూపలేదు. కరోనా మహమ్మారి ఇంకా ప్రజల్లోనే ఉన్న కారణంగా తన యూనిట్ సభ్యులకు ఎలాంటి హాని కలగకూడదనే ఉద్దేశంతో చిరంజీవి షూటింగ్‌ను ప్రారంభించలేదు. చిరంజీవి నిర్ణయం వల్ల సినిమా ఇంకా ఆలస్యమవుతుందని ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అయితే, చిరంజీవి ఇప్పుడు అభిమానులకు శుభవార్త చెప్పారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోన్న సమాచారం. ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొనడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. నవంబర్ మూడో వారం నుంచి చిరంజీవి షూటింగ్‌లో పాల్గొంటారు. అంతకన్నా ముందు ఇతర నటీనటులతో కొరటాల శివ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. చిరంజీవితో షూటింగ్ మొదలుకాగానే రామ్ చరణ్ కాంబినేషన్‌లో కూడా సీన్స్ షూట్ చేస్తారని సమాచారం. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34y7XoK
v
No comments:
Post a Comment