పంచభూత క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న కొత్త సినిమాలో హీరోగా నటిస్తున్నారు . తాజాగా ఈ చిత్రానికి '' అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు చిత్ర టైటిల్ లుక్ విడుదల చేశారు. జాకట రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తారకరత్న సరసన హీరోయిన్‌గా కోన శశిత నటిస్తోంది. ఓ షెడ్యూల్ మినహా ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ని 25 అక్టోబర్ విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ.. ''గతంలో ఖోఖో నేపథ్యంలో 'రథేరా' నిర్మించాం. జనవరిలో విడుదలైన ఆ చిత్రానికి చాలా మంచి స్పందన వచ్చింది. ఆ సినిమాను చూసిన ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి నాన్న, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మమ్మల్ని అభినందించారు. ఆ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు ఖోఖో నేపథ్యంలోనే తారకరత్నతో 'సారథి' సినిమా తీస్తున్నాం. Also Read: ఇందులో తారకరత్న డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తారు. ఈ చిత్రం ఒక షెడ్యూల్ మినహా సినిమా మొత్తం పూర్తయింది. ఇటీవల కడపలో తీసిన షెడ్యూల్‌తో సినిమా ప్రధాన షూటింగ్ పార్ట్ పూర్తయింది. కరోనా సమయంలో కూడా తారకరత్న ఎంతో సాహసంతో షెడ్యూల్‌ను పూర్తి చేసి మాకు సహకరించారు. ఆయనకు చిత్ర సాంకేతిక బృందం ఎంతో ఋణపడి ఉంటుంది. త్వరలోనే మిగితా షూటింగ్ పూర్తిచేసి మీ ముందుకు వస్తాం" అన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31ofFzA
v
No comments:
Post a Comment