Tuesday, 6 October 2020

సాయి ధరమ్ తేజ్‌కు కరోనా.. ఒక్క ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన సుప్రీం హీరో

టాలీవుడ్‌లో చాలా మంది స్టార్లు కరోనా బారిన పడ్డారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా కరోనా సోకింది. అయితే, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌కు కూడా కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని మంగళవారం రూమర్లు చక్కర్లు కొట్టాయి. కరోనా పాజిటివ్ రావడంతో సెల్ఫ్ అసోలేషన్‌లోకి వెళ్లిపోయారని కూడా వదంతులు వచ్చాయి. ఈ వదంతులకు కారణం కూడా ఉంది. తేజూ హీరోగా వస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొంత ఆలస్యం జరిగింది. దీంతో తేజ్‌కు కరోనా సోకడం వల్లే డబ్బింగ్ పనులు వాయిదా వేశారని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే, ఈ పుకార్లన్నింటికీ సాయి తేజ్ ఒక్క ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టారు. ఈ రూమర్లు మొదలైన కొద్దిసేపటికే తేజూ స్పందించారు. దర్శకుడు దేవా కట్టతో చేయబోయే తన తరవాత సినిమాకు సంబంధించి ఒక వర్కింగ్ స్టిల్‌ను తేజూ ట్వీట్ చేశారు. ‘‘#SD14 కోసం ప్రిపరేషన్ ప్రారంభమైంది. దేవా కట్ట గారు తన రచనతో రక్తి కట్టిస్తున్నారు. సెట్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాం’’ అని తేజూ తన ట్వీట్‌లో పేర్కొ్న్నారు. అంతేకాదు, తాను ఫిట్‌గా ఉన్నట్టు తెలియజేడానికి బైసెప్స్ ఎమోజీని కూడా పెట్టారు. ఇదిలా ఉంటే, ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో తేజూ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసుకున్న తేజూ.. ఇప్పుడు దేవా కట్ట దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది తేజూకి 14వ సినిమా. ఈ సినిమాలో తేజూ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర పోషించడానికి కొంత మంది యంగ్ ఐఏఎస్ ఆఫీసర్లను క్లోజ్‌గా మానిటర్ చేయనున్నారు తేజూ. ఈ విషయాన్ని ఇటీవల ఆయన ‘హైదరాబాద్ టైమ్స్’కు వెల్లడించారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HZia4B
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...