Tuesday, 6 October 2020

అజయ్ దేవగణ్ ఇంట విషాదం.. హీరో ఎమోషనల్ ట్వీట్

బాలీవుడ్ నటుడు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు అనిల్ దేవగణ్ సోమవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని అజయ్ దేవగణ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అనిల్ మరణంతో తన కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయిందని చెప్పారు. అనిల్ దేవగణ్ దర్శకుడు. అజయ్ హీరోగా వచ్చిన ‘రాజు చాచా’, ‘బ్లాక్‌మెయిల్’ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే ‘సన్ ఆఫ్ సర్దార్’కు క్రియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ‘‘గత రాత్రి నా సోదురుడు అనిల్ దేవగణ్‌ను కోల్పోయాను. ఆయన అకాల మరణం మా కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. అజయ్ దేవగణ్ ఫిలింస్ (ADFF), నేను ఆయన ప్రియమైన ఉనికిని కోల్పోతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించండి. ప్రస్తుత ఆందోళన పరిస్థితుల కారణంగా మేం వ్యక్తిగత సంతాప సభను ఏర్పాటు చేయడంలేదు’’ అని అజయ్ దేవగణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అజయ్ ట్వీట్ చేయడంతో ఆయన అభిమానులు అనిల్ ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్లు పెడుతున్నారు. అజయ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా, అజయ్ దేవగణ్ తండ్రి, బాలీవుడ్ స్టంట్ మాస్టర్ వీరు దేవగణ్ గతేడాది మరణించారు. ఇప్పుడు ఆయన సోదరుడు అనిల్ దేవగణ్ అకాల మరణం చెందడం బాధాకరం. అయితే, అనిల్ దేవగణ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jCg4FJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...