Tuesday, 6 October 2020

హీరోయిన్‌తో డ్యుయెట్ పాడుతోన్న సుశాంత్

‘చి. ల. సౌ’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన యంగ్ హీరో .. అల్లు అర్జున్ ‘అల వైకుంఠ‌పుర‌ములో’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఆ సినిమా త‌ర్వాత ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం ‘ఇచ్చట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌. ద‌ర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్లపై ర‌విశంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల నిర్మిస్తున్నారు. ‘నో పార్కింగ్’ అనేది ట్యాగ్ లైన్‌. ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో సోమ‌వారం పునఃప్రారంభ‌మైంది. ప్రస్తుతం హీరో హీరోయిన్లు సుశాంత్‌, మీనాక్షి చౌదరిల‌పై ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ప్రవీణ్ ల‌క్కరాజు సంగీతం అందించిన ఈ పాట‌ను శ్రీ‌నివాస‌మౌళి ర‌చించారు. కొరియోగ్రాఫ‌ర్ రాజ్ కృష్ణ ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. సెప్టెంబ‌ర్ 20 న‌ట‌సామ్రాట్ అక్కినేని నాగేశ్వర‌రావు జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్టర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింద‌ని చిత్ర బృందం తెలిపింది. రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ బైక్‌ను స్టార్ట్ చేస్తున్న సుశాంత్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ‘గేర్ మార్చి బండి తియ్’ అనే క్యాప్షన్ ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయ్యింది. అంత‌కుముందు విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌కు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌ని చిత్ర బృందం తెలియ‌జేసింది. కాగా, ఈ చిత్రంలో వెంక‌ట్‌, వెన్నెల కిశోర్‌, ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గోమ‌టం, ఐశ్వర్య, నిఖిల్ కైలాస‌, కృష్ణచైత‌న్య ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ ల‌క్కరాజు సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సురేష్ భాస్కర్ సంభాషణలు రాశారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2F3QESm
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...