Monday, 5 October 2020

పెళ్లి పీటలెక్కనున్న చందమామ.. వ్యాపారవేత్తతో సీనియర్ బ్యూటీ నిశ్చితార్థం!

హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు పెళ్లి సమయం దగ్గర పడినట్లు తెలుస్తోంది. ఆమె త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముంబయికి చెందిన గౌతమ్‌ కిచ్లు అనే బడా వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం క్రితం వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారినట్లు సమాచారం. రెండు కుటుంబాల సమక్షంలో ఇరువురికి నిశ్చితార్థం కూడా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాజల్‌ పెళ్లిపై రూమర్లు రావడం ఇదే తొలిసారి కాదు. తన పెళ్లిపై వస్తున్న వదంతులను ఆమె ఎన్నోసార్లు ఖండించారు. తాజాగా జరుగుతున్న ప్రచారంపై కాజల్ స్పందించకపోవడంతో ఇది నిజమే అయి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆమెకు అప్పుడే శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ తన అందచందాలు, అభినయంతో ఎంతోమందిని అభిమానులుగా మార్చుకుంది. ‘చందమామ’తో స్టార్‌డమ్ దక్కించుకుని రామ్‌చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, పవన్‌కళ్యాణ్‌ తదితర స్టార్ హీరోల పక్కన నటించింది. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమా ‘ఖైదీ నంబర్ 150’లోనూ ఆడిపాడింది. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య, కమల్‌హాసన్ సరసన ఇండియన్-2 సినిమాల్లో నటిస్తోంది. మంచు విష్ణుతో మోసగాళ్లు, బాలీవుడ్‌లో జాన్ అబ్రహాంతో ఓ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30CGUGu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...