Monday, 5 October 2020

‘మీ కొడుకులకి కూడా సంస్కారం నేర్పండి’.. బీజేపీ ఎమ్మెల్యేకి నటి చురకలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రస్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు కొనసాగుతున్నాయి. అన్నివైపుల నుంచి వస్తున్న విమర్శలు, ఒత్తిడులతో యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. ఈ తరుణంలో అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారాలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. యూపీలో రామరాజ్యం కొనసాగుతోందని ప్రజలు భావిస్తున్నప్పటికీ అత్యాచారాలు ఎందుకు కొనసాగుతున్నాయి అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ షాకింగ్ సమాధానం ఇచ్చారు. Also Read: ‘‘కూతుళ్లకు మంచి బుద్ధులు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. వారికి మన సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించాలి. అప్పుడే అత్యాచారాలు తగ్గుతాయి’’ అని వ్యాఖ్యానించారు. సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యాల వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పెద్ద దుమారమే రేగుతోంది. ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడే ఉన్మాదులకు ఎమ్మెల్యే మాటలు మరింత ప్రేరణ కలిగించేలా ఉన్నాయని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి తీవ్రంగా స్పందించారు. ‘‘అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తమ కూతుళ్లకు సంస్కారం నేర్పించాలా? చాలా గందరగోళంగా ఉన్నాయి ఆ వ్యాఖ్యలు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా తెలుస్తుందా? ఇలాంటి ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూతుళ్లకే సంస్కారం నేర్పించాలా? మీ కొడుకులకు సంస్కారం నేర్పించలేరా?’’ అని కృతి సనన్ మండిపడింది. ఇలాంటి బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు చేసిన సురేంద్ర సింగ్.. పాపి అంటూ మరో నటి స్వరా భాస్కర్‌కు ట్విటర్ ద్వారా స్పందించారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34osdHX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...