Wednesday, 7 October 2020

మళ్లీ ‘టక్’ చేసిన నాని

నేచురల్ స్టార్ మళ్లీ ‘టక్’ చేసుకున్నారు. టక్ చేసుకుని షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ‘టక్ జగదీష్’ చిత్ర యూనిట్‌తో పాటు నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నాని హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘టక్ జగదీష్’. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ.. ‘టక్ జగదీష్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్‌గా కనిపించనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ ఐదు నెలలపాటు తాత్కాలికంగా ఆగిపోయింది. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండటంతో సినిమా షూటింగ్‌లు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ‘టక్ జగదీష్’ చేరింది. ఈ మేరకు నాని ట్వీట్ చేశారు. ‘‘జగదీష్ జాయిన్ అయ్యాడు. టక్ మొదలైంది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. టక్ చేసుకుని, పక్కన మాస్క్ తగిలించుకుని వెనుక నుంచి తీసుకున్న ఫొటోను కూడా నాని ట్వీట్‌లో పొందుపరిచారు. కాగా, ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. షైన్ స్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HZH5Fa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...