Wednesday, 7 October 2020

Nishabdham: అనుష్క ‘నిశ్శబ్దం’కి డ్యామేజ్.. కోటి డిమాండ్ చేస్తోన్న నిర్మాతలు

శెట్టి, మాధవన్, సుబ్బరాజు, షాలిని పాండే, అంజలి ప్రధాన పాత్రలు పోషించిన మిస్టరీ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. అయితే, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. విమర్శకులైతే తక్కువ మార్కులే వేశారు. సినిమా సంగతి ఎలా ఉన్నా అనుష్క నటనను మాత్రం అంతా కొనియాడారు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా చిత్ర యూనిట్ అయితే ‘నిశ్శబ్దం’ను ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉంది. సినిమాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తోన్న ఈ సమయంలో చిత్ర నిర్మాతలకు అనుకోని షాక్ తగిలిందట. ఈ సినిమా అమెజాన్ విడుదలైన కొన్ని గంటల్లోనే ఓ కేబుల్ ఛానల్ ప్రసారం చేసేసిందని సమాచారం. ఈ విషయం నిర్మాతల దృష్టికి వెళ్లింది. ఆ కేబుల్ ఛానల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాతలు.. వారికి లీగల్ నోటీస్ పంపినట్టు సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం ఆ కేబుల్ ఛానల్‌ను డ్యామేజ్ ఛార్జెస్ కింద నిర్మాతలు రూ.1.1 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, అమెజాన్ ప్రైమ్ సైతం మరో రూ.30 లక్షలు డిమాండ్ చేస్తుందట. ఈ మేరకు ఓ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించగా.. దాన్ని దర్శకుడు హేమంత్ మధుకర్ రీట్వీట్ చేశారు. అంటే, ఈ వార్తలో కచ్చితంగా నిజం ఉంది. మరి ఇంత మొత్తాన్ని ఆ కేబుల్ ఛానల్ కడుతుందో లేదంటే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30IxxVy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...