Friday, 9 October 2020

పెళ్లి సందడి మళ్ళీ మొదలు అంటూ హుషారెత్తించిన దర్శకేంద్రుడు.. రాఘవేంద్ర రావు కొత్త సినిమా ప్రకటన

తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుల్లో దర్శకేంద్రుడు ముందు వరుసలో ఉంటారు. ఒకానొక సమయంలో వరుస సినిమాలతో దూసుకుపోయిన ఆయన.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని ఎన్నో అద్భుత విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు శతాధిక సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా అరుదైన ఘనత కూడా సాధించాడు. ఆ తర్వాత కాస్త నెమ్మదించిన దర్శకేంద్రుడు తాజాగా మరో సినిమా అనౌన్స్ చేసి తెలుగు ప్రేక్షకుల్లో జోష్ నింపారు. Also Read: గత మూడేళ్ళుగా దర్శకేంద్రుడి సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసిన తెలుగు ప్రేక్షకులను హుషారెత్తించే ప్రకటన చేశారు రాఘవేంద్ర రావు. '' మళ్ళీ మొదలవ్వబోతుంది.. తారాగణం త్వరలో..'' అంటూ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో రూపొందనున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నారని పేర్కొంటూ టైటిల్ లుక్‌తో కూడిన వీడియో రీలీజ్ చేశారు. గత 25 ఏళ్ల క్రింద 1996లో 'పెళ్లి సందడి' సినిమాను ప్రేక్షకుల ముందుంచి భారీ సక్సెస్ అందుకున్నారు రాఘవేంద్ర రావు. కీరవాణి అందించిన బాణీలు ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. ఇప్పటికీ పెళ్లి సందడి పాటలు సంగీత ప్రియులను మైమరిపిస్తూనే ఉన్నాయి. అలాంటి ఎవర్‌గ్రీన్ కాంబో మరోసారి అదే 'పెళ్లి సందడి' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుండటం జనాల్లో ఆతృత పెంచేసింది. చూడాలి మరి దర్శకేంద్రుడు ఈ సినిమాలో ఏయే నటీనటులను ఎంపిక చేస్తారో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36Lv8xe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...