Friday, 9 October 2020

Laxmmi bomb Trailer: కుటుంబంతో ఆటాడుకుంటున్న దెయ్యం.. లారెన్స్ రోల్‌లో అక్షయ్ ఇమిడినట్లేనా?

తెలుగు ప్రేక్షకులను 'కాంచన' పేరుతో భయపెట్టిన రాఘవ లారెన్స్.. ఇక బాలీవుడ్ ఆడియన్స్‌కి వణుకు పుట్టించేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు కాంచన సినిమాను '' పేరుతో హిందీలో రీమేక్ చేసిన ఆయన తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు. 3 నిమిషాల 40 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్‌లో అక్షయ్ కమార్ పర్‌ఫార్‌మెన్స్ హైలైట్ అవుతోంది. హీరో పాత్రతో పాటు ట్రాన్స్‌జెండర్‌గా రెండు పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే అక్షయ్ నటన ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ తెచ్చిపెట్టడం ఖాయం అనిపిస్తోంది. హిందీలో లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న మొదటి సినిమా ఇదే. కాంచన సిరీస్ నచ్చి ఈ సినిమా రీమేక్ బాధ్యతలు స్వయంగా అక్షయ్ కుమార్ తీసుకోవడం విశేషం. Also Read: ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలను బట్టి అచ్చం కాంచన సినిమానే దించేశారని అర్థమవుతోంది. కుటుంబంతో ఆటాడుకుంటున్న దెయ్యంతో మరోసారి భయపెట్టాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. కాంచనలో లారెన్స్ పోషించిన పాత్రను 'లక్ష్మీ బాంబ్'లో అక్షయ్ కుమార్ చేశారు. అచ్చం లారెన్స్ లాగే హావభావాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. దీంతో సోషల్ మీడియా అంతా లారెన్స్, అక్షయ్ నటనలను పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో 'లక్ష్మీ బాంబ్' మూవీ కాంచన డూప్లికేట్ అంటూ లారెన్స్ నటనకే ఎక్కువ మార్కులు వేస్తుండటం విశేషం. ఈ చిత్రానికి అమర్ మోహిలే ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. తనీష్ బాగ్చీ, శశీ-ఖుషీ, అనూప్ కుమార్ సంగీతం సమకూర్చారు. హారర్ కామెడీ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని నవంబర్ 9వ తేదీన హాట్ స్టార్‌లో రిలీజ్ చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30LnkrG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...