Sunday, 13 September 2020

Sravani Suicide: శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్.. దేవరాజ్‌ బాగోతం బయటపెట్టిన సాయి కృష్ణ!

మౌనరాగం సీరియల్ నటి శ్రావణి (26) ఆత్మహత్య కేసులో గంటకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. శ్రావణి సూసైడ్ కేసులో ఇప్పటికే దేవరాజ్ అనే వ్యక్తిని విచారించిన పోలీసులు.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి సాయి కృష్ణతో పాటు ఆమె కుటుంబ సభ్యులను మరికొద్ది సేపట్లో విచారించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న సాయి కృష్ణ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ దేవరాజ్‌ బాగోతం ఇదీ, శ్రావణి ఆత్మహత్యకు వాడే కారణం అంటూ అతని గురించి ఎన్నో విషయాలు బయటపెట్టాడు. శ్రావణి ఆత్మహత్యకు కారణం అని బలంగా ఆరోపిస్తున్నాడు సాయి కృష్ణ. అతనే శ్రావణిని మానసికంగా వేధించాడని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటున్నాడు. టిక్ టాక్ ద్వారా శ్రావణిని పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో మోసం చేశాడని, దీంతో తీవ్ర మనస్తాపం చెంది శ్రావణి సూసైడ్ చేసుకుందని సాయి కృష్ణ చెప్పాడు. దేవరాజ్ ఖాతాలో ఇంకా చాలామంది అమ్మాయిలు, ఆంటీలు ఉన్నారని అన్నాడు. వాడిపని అమ్మాయిలను ట్రాప్ చేసి మోసం చేయడమే అని చెప్పిన సాయి కృష్ణ.. దేవరాజ్ తనపై తప్పుడు సాక్ష్యాలు పుట్టిస్తున్నాడని అన్నాడు. Also Read: దేవరాజ్ వేరే అమ్మాయిలతో ఉన్న వీడియోలు, మాట్లాడిన ఆడియోలు శ్రావణినే స్వయంగా తమకు ఇచ్చిందని సాయి కృష్ణ తెలిపాడు. ఈ కేసు నుంచి బయట పడేందుకు నిర్మాత అశోక్ రెడ్డిని కూడా అతనే ఇరికించాడని చెప్పాడు. ఒకవేళ తాను శ్రావణిని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటే ఎప్పుడో చేసుకొనే వాడినని, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇష్టమే అని చెప్పుకొచ్చాడు. తాను శ్రావణిని వేధించలేదని, దేవరాజ్ వేధిస్తుంటే వార్నింగ్ ఇచ్చానని చెప్పిన సాయి కృష్ణ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని అన్నాడు. మరోవైపు దేవరాజ్ ఇప్పటికే పోలీసులకు ఇచ్చిన ఆధారాల ద్వారా సాయి కృష్ణ వైపు కేసు మళ్లుతుందేమోనని అనిపిస్తోంది. నిర్మాత అశోక్ రెడ్డితో సహజీవనం కోసం సాయి, శ్రావణిని విపరీతంగా వేధించినట్లు దేవరాజ్ కొన్ని రుజువులు పోలీసులకు చూపించాడు. ఈ పరిస్థితుల నడుమ శ్రావణి సూసైడ్ కేసు మిస్టరీని తలపిస్తోంది. సో.. చూడాలి మరి పోలీసుల ఎదుట సాయి కృష్ణ ఎలాంటి ఆధారాలు చూపిస్తాడనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mbxivv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...