Sunday, 13 September 2020

‘కంబాపపల్లి కథలు’ వెబ్ సిరీస్ .. బుల్లితెరపై ప్రియదర్శి సందడి

ఇటీవల కాలంలో సినిమాల కంటే వెబ్‌సిరీస్‌లకు ఆదరణ పెరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ సినిమా నటులు, టెక్నీషియన్స్ డిజిటల్ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అనుబంధం సంస్థ స్వప్న సినిమాస్‌ బ్యానర్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మితమవుతోంది. దీనిలో ప్రముఖ హాస్య నటుడు నటిస్తున్నాడు. Also Read: వి 'కంబాలపల్లి కథలు' పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ఆదివారం ప్రారంభమైంది. ఉదయ్‌ గుర్రాల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ వెబ్ సిరీస్‌లో హైబత్‌ అనే పాత్రలో ప్రియదర్శి నటిస్తున్నాడు. కంబాలపల్లి అనేది వరంగల్ సమీపంలోని ఓ కుగ్రామం. దీంతో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్ సిరీస్‌ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రియదర్శి ట్వీట్ చేశాడు. సినిమాల్లో తన హాస్యంతో కడుపుబ్బా నవ్వించే ప్రియదర్శి బుల్లితెర ద్వారా ప్రేక్షకులను మరింత అలరించనున్నాడు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32np2R9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...