సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు బాలీవుడ్ ఇండస్ట్రీని వణికిస్తున్నాయి. మొదట నెపోటిజం ఇష్యూపై పలువురు సినీ తారలు సంచలన ఆరోపణలు గుప్పించగా.. తాజాగా బాలీవుడ్‌లో డ్రగ్స్ కల్చర్ తెరపైకి రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సుశాంత్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా రంగంలోకి దిగిన సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కూపీ లాగుతుండగా అనూహ్యంగా డ్రగ్స్ కోణం బయటపడింది. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ ప్రేయసి రియా.. పలువురు బాలీవుడ్ నటుల పేర్లు బయటపెట్టడంతో ఈ ఇష్యూ మరెన్నో అనుమానాలను లేవనెత్తింది. మరోవైపు బాలీవుడ్ బడా బాబులకు డ్రగ్స్ పెడల్స్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని, డ్రగ్స్ లేని బాలీవుడ్ పార్టీలు ఉండవని పేర్కొన్న ఫైర్ బ్రాండ్ .. తీగ లాగితే డొంక కదులుతుందని సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కంగనాకు సపోర్ట్ చేస్తూ బాలీవుడ్ డ్రగ్స్ ఇష్యూపై రియాక్ట్ అయింది బోల్డ్ బ్యూటీ . అక్కడి పార్టీ కల్చర్ ఎలా ఉంటుందనేది తెలుపుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. Also Read: ఒకప్పుడు తానొక చైన్ స్మోకర్‌ని అని, 2017 సంవత్సరంలో ధూమపానం సేవించడం మానేశానని పేర్కొన్న ఈ హాట్ హీరోయిన్.. తాను మద్యానికి కూడా బానిసయ్యానని తెలిపింది. మార్చిలో లాక్‌డౌన్ విధించే వరకు తాను మద్యం తీసుకునేదాన్నని చెప్పిన ఆమె బాలీవుడ్ పార్టీల్లో ఫుల్లుగా డ్రగ్స్ వాడతారంటూ బాంబు పేల్చింది. బాలీవుడ్‌లో జరిగే పార్టీలకు హాజరైన సమయంలో ప్లేట్స్‌లో డ్రగ్స్ పెట్టి ఇచ్చేవారని ఆమె చెప్పింది. అయితే డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు తనకు ముందే తెలుసు కాబట్టి వాటికి దూరంగా ఉండేదాన్నని తెలిపింది. ఇకపోతే సుశాంత్ కేసులో న్యాయం కోసం కంగనా చేస్తున్న పోరాటాన్ని సమర్ధించింది షెర్లిన్ చోప్రా. కంగన రనౌత్ ధైర్యశాలి అని, మేఘంగా గర్జించగల సత్తా ఆమెకు ఉందని, ఎవరెన్ని కుట్రలు పన్నిన్నా ఆమె ఎదుగుదలను ఆపరలేరంటూ రెచ్చిపోయింది షెర్లిన్ చోప్రా. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mjDcuD
v
No comments:
Post a Comment