Friday, 11 September 2020

Samantha: నువ్వెక్కడుంటే నేనక్కడుంటా..! ప్రేమ విలువ తెలుపుతూ స్పెషల్ వీడియోతో ఆకర్షించిన సమంత

అక్కినేని కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన, తన అక్కినేని ఫ్యామిలీ లేటెస్ట్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేసి ప్రేమ విలువేంటో తెలిపింది. ప్రేమ, ప్యార్, ఇష్క్ అనేది కేవలం మనుషుల్లోనే కాదు ఇతర జంతువుల్లో కూడా ఉంటుందని తెలిపే వీడియో పోస్ట్ చేసి ఆకర్షించింది సామ్. తనతో కలిసి జీవిస్తున్న ఆవు ఎడబాటును ఓ ఎద్దు అస్సలు తట్టుకోలేకపోయింది. తన నుంచి ఆవును వేరు చేస్తూ వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళ్తుంటే.. ఆ వ్యాన్ వెనకాలే పరిగెడుతూ ఆవుపై తన ఇష్టాన్ని కనబర్చింది. ఇండియాలోనే జరిగిన ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దీంతో ''నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, ప్రేమనే ఇదేరా'' అంటూ కామెంట్ చేస్తూ ఆ ఎద్దు- ఆవులు కలిసి జీవించాలని లక్షలమంది నెటిజన్స్ కోరుకున్నారు. ఇది చూసి చివరకు వాటి యజమాని మనసు మార్చుకుని ఆ రెండింటినీ కలిపాడు. ఇదే వీడియోను షేర్ చేసి లవ్ గ్రేట్‌నెస్ ఇదీ అని చెప్పకనే చెప్పింది సమంత. Also Read: సమంత కూడా నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. చాలాసార్లు చైతూపై ఉన్న ప్రేమను బయటపెడుతూ పోస్టులు పెట్టింది సామ్. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ జోడీగా చైసామ్ జోడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరిద్దరికి సంబంధించిన టూర్, సరదా ట్రిప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఎన్నో సందర్భాల్లో చూశాం. ఇకపోతే సినిమాలతో పాటు పలు బిజినెస్ కార్యకలాపాలతో బిజీ అవుతూ పవర్‌ఫుల్ విమెన్ అనిపించుకుంటోంది ఈ అక్కినేని కోడలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3inC5Yh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...