Friday, 11 September 2020

చిక్కుల్లో ఏఆర్ రెహమాన్... ఆ కేసులో నోటీసులిచ్చిన మద్రాస్ హైకోర్టు

ఆస్కార్ విజేత, బహుభాషా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు మద్రాస్ హైకోర్టులో నోటీసులు జారీచేసింది. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఆదాయపు పన్ను అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యంపై తమకు సమాధానం ఇవ్వాడని ఆయన్ని ఆదేశించింది. రింగ్‌టోన్లు కంపోజ్ చేసి ఇచ్చేందుకు బ్రిటన్‌కు చెందిన టెలికాం కంపెనీతో రెహమాన్ ఒప్పందం చేసుకున్నారు. ఇందుకోసం రూ.3.47కోట్ల భారీ పారితోషికం తీసుకున్నారు. Also Read: అయితే ఆ మొత్తాన్ని రెహహాన్ తన ఆదాయంగా చూపించకుండా ట్రస్టుకు బదిలీ చేశారని ఆదాయపన్ను అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఐటీ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. తన సేవల ద్వారా పొందిన ఆదాయానికి రెహమాన్ పన్ను కట్టకపోవడం నేరమని అన్నారు. తీసుకున్న పారితోషికాని సంబంధించి కట్టకుండా ఎగవేతకు పాల్పడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన రెహమాన్‌కు శుక్రవారం నోటీసులు జారీచేసింది. ఐటీ అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యంపై సరైన వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ikguA9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...