యాక్టర్ సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత ఊహించని విధంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ ఇష్యూ సినీ తారల మధ్య విభేదాలకు కారణమవుతోంది. సుశాంత్ మరణం తర్వాత మొదటి నుంచి బాలీవుడ్‌లో నెపోటిజంపై సంచలన కామెంట్స్ చేసిన కంగనా.. డ్రగ్స్ ఇష్యూ బయటపడగానే మరింత రెచ్చిపోతోంది. బాలీవుడ్ అంతా డ్రగ్స్ మయమే అని, అక్కడ డ్రగ్స్ వాడని పార్టీలే ఉండవని పేర్కొంటూ చుక్కలు చూపిస్తోంది. దీంతో కంగనా చేసిన ఈ వ్యాఖ్యలను కొందరు సినీ తారలు వ్యతిరేకించడం, వారిపై కంగనా నోరు పారేసుకోవడం జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూలో కూడా దూరి సింగిల్ లైన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన పలు సినిమాల్లో నటించి ఫేమస్ అయిన హాట్ హీరోయిన్ ఊర్మిళపై షాకింగ్ కామెంట్స్ చేసింది . కంగన లాంటి వాళ్లు బాలీవుడ్ పరిశ్రమ ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదని పేర్కొన్న ఉర్మిళపై ఓ రేంజ్‌లో విరుచుకుపడింది. ఓ సాఫ్ట్ పోర్న్ స్టార్ అని పేర్కొంటూ ఆమెకు అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయడం మాత్రమే తెలుసు తప్ప అస్సలు నటనే రాదని నీచమైన వ్యాఖ్యలు చేసింది కంగనా. దీంతో ఈ వివాదం పెద్దదై జనాల్లో హాట్ ఇష్యూగా మారింది. Also Read: కంగనా తీరుపై పలువురు బాలీవుడ్ స్టార్స్ ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఊర్మిళ- కంగనా ఇష్యూలో దూరిన వివాదాస్పద వీరుడు రామ్ గోపాల్ వర్మ.. తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు. ''బాలీవుడ్ తారలు ఇలా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడం నాకు నచ్చడం లేదు.. ఏదిఏమైనా ఊర్మిళ తన టాలెంట్‌తో సత్తా చాటింది. ఆమె ఓ విలక్షణ నటి'' అని పేర్కొన్నారు. మరోవైపు ఊర్మిళ సైతం కంగనా వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని లైట్ తీసుకోవడం విశేషం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33IC4Z4
v
No comments:
Post a Comment