Thursday, 17 September 2020

‘తెరవెనుక’ రకుల్ తమ్ముడు.. రివీల్ చేసిన ప్రముఖ దర్శకుడు

ప్రముఖ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా నటించిన చిత్రం ‘’. ఆయుష్ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి మచ్చ సమర్పణలో మురళి జగన్నాథ్ మచ్చ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నెలుట్ల ప్రవీణ్ చంద్ర దర్శకుడు. ఈ చిత్రంలో విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి హీరోయిన్లుగా, ఆనంద చక్రపాణి , నిట్టల శ్రీరామమూర్తి, టీఎన్ఆర్, శ్వేత వర్మ, సంపత్ రెడ్డి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ... ఈ చిత్ర దర్శకుడు ప్రవీణ్ చంద్ర తనకు పాతికేళ్లుగా తెలుసునని తెలిపారు. ఈ సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానన్నారు. ఈ సినిమాలో పనిచేసిన అందరూ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెరవెనుక’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని ఆయన కోరుకున్నారు. Also Read: సామాజిక స్పృహ కలిగిన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపుదిద్దుకున్న ‘తెరవెనుక’ ఫస్ట్‌లుక్‌ను ఎన్.శంకర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని దర్శకుడు నెలుట్ల ప్రవీణ్ చంద్ర అన్నారు. నిర్మాత మచ్చ జగన్నాథ్ తనను నమ్మి సినిమా బాధ్యతను అప్పగించారని అన్నారు. అందరి అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమాను తీర్చిదిద్దామని, త్వరలోనే టీజర్ విడుదల చేస్తామని తెలిపారు. సాంకేతిక నిపుణులు: కథ, మాటలు - బాబా కెమెరా - రాము కంద, ఎడిటర్ - బొంతల నాగేశ్వరరెడ్డి మ్యూజిక్ - రఘురామ్ ఫైట్స్ - సూపర్ ఆనంద్ డాన్స్- కపిల్, శిరీష్ , అనీష్ పాటలు- కాసర్ల శ్యామ్, సురేష్ బనిశెట్టి , బండి సత్యం రఘురామ్ పీఆర్వో - మధు వి.ఆర్


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3klJury
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...