Thursday, 17 September 2020

మోదీ బయోపిక్ ‘మనో విరాగి’... బర్త్‌డే రోజు సర్‌ప్రైజ్ ఇచ్చిన యూనిట్

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి తెలుగులో '', తమిళంలో ‘కర్మయోగి’ అనే టైటిల్స్ ఖరారు చేశారు. ఎస్. సంజయ్ త్రిపాఠీ రచన, దర్శకత్వంలో మహావీర్ జైన్‌తో కలిసి బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్నారు. గురువారం మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా పోస్టర్లు విడుదల చేశారు. Also Read: 'మనో విరాగి'లో నరేంద్ర మోదీ పాత్రలో అభయ వర్మ నటిస్తున్నారు. మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోని వాద్‌నగర్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రదేశాల్లో షూటింగ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి పిఆర్ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, ఛాయాగ్రహణం: మహేష్ లిమయే, సహ నిర్మాణం: జనహిత్ మే జారీ ప్రొడక్షన్, రచన-దర్శకత్వం: ఎస్. సంజయ్ త్రిపాఠీ, నిర్మాణం: సంజయ్ లీలా భన్సాలీ, మహావీర్ జైన్, సమర్పణ: లైకా ప్రొడక్షన్స్ 'మనో విరాగి' బయోపిక్‌ గురించి లైకా ప్రొడక్షన్స్‌ అధినేత ఎ.సుభాస్కరన్ మాట్లాడుతూ.. "ప్రధాని మోడీ గారి టీనేజ్ వయసులో జరిగిన అనేక ఘటనలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో సమర్పిస్తుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది తమ సంస్థకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. Also Read: తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా 'ఖైదీ నెంబర్ 150'కి సమర్పకులుగా వ్యవహరించారు లైకా ప్రొడక్షన్స్ అధినేత ఎ.సుభాస్కరన్. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన '2.0', 'దర్బార్' చిత్రాలను ఆయన నిర్మించారు. దీంతో పాటు విజయ్ హీరోగా నటించిన 'కత్తి', మణిరత్నం దర్శకత్వం వహించిన 'నవాబ్' చిత్రాలనూ నిర్మించారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పొన్నియన్ సెల్వన్', కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో 'ఇండియన్ 2' చిత్రాలను నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35MiAoS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...