బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో దర్యాప్తు చేసే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె జీవితంతో సాయికృష్ణారెడ్డి, దేవరాజ్‌రెడ్డి ఆడుకోవడంతోనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఇన్నాళ్లూ అందరూ అనుకున్నారు. అయితే ఈ కేసులో తాజాగా అరెస్టయిన ఆర్ఎక్స్ 100 చిత్ర నిర్మాత లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వారిద్దరి కంటే అశోక్‌రెడ్డే ఆమె జీవితంతో ఎక్కువగా ఆడుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. Also Read: శ్రావణితో అశోక్‌రెడ్డికి 2017లో పరిచయం ఏర్పడింది. ఆమె ఆర్థిక పరిస్థితి ఆసరాగా తీసుకుని అన్నివిధాలా ఉపయోగించుకున్నాడు. ఈ క్రమంలోనే తాను నిర్మించిన ఆర్ఎక్స్ 100 సినిమాలో చిన్న రోల్ ఇచ్చాడు. అవసరమైనప్పుడల్లా శ్రావణికి ఆర్థికసాయం చేస్తూ లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. తాను చెప్పినట్లు వినాలని, తననే పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు పాల్పడేవాడు. తరుచూ ఇంటికెళ్లి కుటుంబసభ్యులు ముందే ఆమెను బ్లాక్‌మెయిల్ చేసేవాడు. అశోక్‌రెడ్డికి మద్దతుగా సాయి కూడా శ్రావణిని ఒత్తిడి చేసేశాడు. ఈ క్రమంలోనే తనకు టిక్‌టాక్ ద్వారా పరిచయమైన దేవరాజ్ రెడ్డితో శ్రావణి క్లోజ్ అయింది. దేవరాజ్‌తో శ్రావణి వ్యవహారం గురించి తెలుసుకున్న అశోక్‌రెడ్డి ఆమెను మరింత వేధించాడు. శ్రావణి ఆత్మహత్య చేసుకున్న రోజు కూడా అశోక్‌రెడ్డి ఆమె ఇంటికి వెళ్లాడు. శ్రావణి కుటుంబసభ్యులతో కలిసి ఆమెను బెదిరించాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సాయి కూడా శ్రావణిని వేధించాడు. ఇదే విషయాన్ని ఆమె దేవరాజ్‌కు ఫోన్ చేసి చెప్పగా.. అశోక్, సాయితో సంబంధాలను తెంచుకుంటేనే తాను పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పాడు. ముగ్గురి వేధింపులు తట్టుకోలేక మానసిక క్షోభకు గురైన శ్రావణి చావే శరణ్యమనుకుని చివరికి ఆత్మహత్య చేసుకుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iJmTVM
v
No comments:
Post a Comment