రెండ్రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో మహానగరం వణికిపోతోంది. ప్రధాన రహదారులతో పాటు అనేక లోతట్టు ప్రాంతాల్లో నీరుచేరి జనజీవనానికి ఆటంకం కలుగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణంపై చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో వాతావరణం అనూహ్యంగా మారుతున్న సంగతి తెలిసిందే. Also Read: బుధవారం సాయంత్రం కూడా భాగ్యనగరంలో కారుమబ్బులు పట్టి భారీ వర్షం పడింది. ఈ క్రమంలోనే రేణుదేశాయ్ స్వయంగా తాను తీసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. 39ఏళ్ల తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం చూడలేదని పేర్కొన్నారు. ''ఇది బ్లాక్ అండ్ వైట్ ఫొటో కాదు.. నిన్న సాయంత్రం క్లిక్ చేసిన కలర్ ఫొటో. నా 39 ఏళ్ళ జీవితంలో ఇలాంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదు. ఆకాశం ఎంతో వాస్తవికమైనదిగా.. సినిమాలో చూపించినట్టుగానే అనిపించింది. ఈ ఫొటోని సాయంత్రం 6 గంటలకు తీయడం జరిగింది. దీనిని ఎలాంటి ఎడిట్ చేయలేదు. ఆకాశం తనను తానే అందంగా ముస్తాబు చేసుకుంది.." అని తెలుపుతూ ఈ పిక్‌ని తన ఐఫోన్ నుంచి తీసినట్లుగా పేర్కొన్నారు రేణు దేశాయ్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iFJiDp
v
No comments:
Post a Comment